
వైద్య విద్య ప్రైవేటీకరణ తగదు
జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాశయం
సాక్షిప్రతినిధి, నెల్లూరు: పేదలు.. బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే యత్నాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్‌లో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళితులు, పేదలు నిరసనను మంగళవారం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఎస్సీ సెల్ నేతలతో కలిసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, మేరిగ మురళీధర్ పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు.
విద్య, వైద్యమనేది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాలనైనా.. ఒక్క సీటైనా అదనంగా తీసుకురాలేదని గుర్తుచేశారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ధనవంతులు సైతం సరైన వైద్యాన్ని అందుకోలేకపోయారని చెప్పారు. ప్రభుత్వ వైద్యులే చికిత్స చేసి పలువురి ప్రాణాలను కాపాడిన అంశాన్ని ప్రస్తావించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశమై శాసనమండలిలో ప్రభుత్వాన్ని తాను నిలదీస్తే, జవాబు చెప్పలేక పలాయనం చిత్తగించారని మేరిగ మురళీధర్ విమర్శించారు. అధికార, ధనబలంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే వేధిస్తున్నారని.. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేసి, భవిష్యత్తులో బుద్ధి చెప్పి.. కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పిల్లలు ఉన్నత చదువులను అభ్యసిస్తే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని గ్రహించిన జగన్‌మోహన్‌రెడ్డి నాడు – నేడు పేరుతో పాఠశాలలు, వైద్య విద్యను బలోపేతం చేశారని ఆనం విజయకుమార్‌రెడ్డి కొనియాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే యత్నాలను మానుకోకపోతే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు.
ఏడు మెడికల్ కళాశాలలను ఒకే సంవత్సరంలో జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే పది కాలేజీలను కంప్లీట్ చేయాలంటే 23 ఏళ్లు పడుతుందని చంద్రబాబు పేర్కొనడం, ఆయన చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.
మెడికల్ కళాశాలలను తాము నడపలేమని, సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖను చంద్రబాబు రాయడాన్ని ప్రజలు క్షమించరని కామరాజు పేర్కొన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు బద్దెపూడి రవీంద్ర, స్వర్ణా వెంకయ్య, మందా రవికుమార్, ఎస్సీ సెల్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఒంగోలు రాఘవేంద్ర, నవకోటి, రాహుల్‌గాంధీ, రాజేష్‌కుమార్, పాముల శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి యిర్మి యా, నేతలు మొయిళ్ల గౌరి, తనూజరెడ్డి, ఖలీల్ అహ్మద్, వెంకటశేషయ్య, బొబ్బల శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు దూరం చేసేందుకే కుట్ర
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను విక్రయించి సొమ్ము చేసుకోవడమే
చంద్రబాబు లక్ష్యం
దీన్ని అడ్డుకొని తీరుతాం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన
జవాబు చెప్పలేక పలాయనం
ఒక్క కళాశాలనైనా తీసుకొచ్చారా..?
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం
ప్రజలు క్షమించరు
బుద్ధి మార్చుకోండి..
పరిస్థితిని స్వయంగా గమనించిన నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వైద్యమందాలని.. పేదలు డాక్టర్లవ్వాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారని కాకాణి చెప్పారు. వీటిలో ఐదింట్లో అడ్మిషన్లు జరగ్గా, మరో ఐదు పూర్తయ్యాయన్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతుండగా, అధికారం మారడంతో సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టాక పదింటిని ప్రైవేటీకరిస్తానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. వీటిని విక్రయించి సొమ్ము చేసుకోవడమే ఆయన లక్ష్యమని ఆరోపించారు. గతంలో మెడికల్ సీట్లు 2360 ఉండేవని, అయితే జగన్‌మోహన్‌రెడ్డి కృషితో ఇవి 4910కు పెరిగాయని పేర్కొన్నారు. కళాశాలలు పూర్తయితే మరిన్ని సీట్లొచ్చే అవకాశం ఉందని, ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

వైద్య విద్య ప్రైవేటీకరణ తగదు

వైద్య విద్య ప్రైవేటీకరణ తగదు