
జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు
ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు
●
పాలకులు చేసే తప్పులను జర్నలిస్టులు ఎత్తి చూపుతారు. వాస్తవాలను తమ కలం ద్వారా వెలుగులోకి తెస్తున్న వారిపై, పత్రికలపై అక్రమ కేసులు పెట్టడం జర్నలిజానికి సంకెళ్లు వేసినట్టే. ఇలాంటి చర్యలు సిగ్గుచేటు. ప్రజా సమస్యలపై వార్తలు రాశారనే కక్షతో సాక్షి ఎడిటర్‌తోపాటు ఆ పత్రిక జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గం. ఇకనైనా కేసులు ఎత్తివేయాలి. – కొండా ప్రసాద్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సీపీఎం కార్యదర్శి
ఏ ప్రభుత్వం తప్పు చేసినా వార్తల ద్వారా జర్నలిస్టులు ప్రశ్నిస్తారు. తప్పులు, మోసాలను ఎత్తి చూపినందుకు కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్ష పెంచుకుంది. ఆ పత్రిక ఎడిటర్, జర్నలిస్టుల గొంతు నొక్కుతోంది. ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మెప్పుపొందాలి. ప్రజా గొంతుకలైన పత్రికలను బెదిరించడం మంచిది కాదు.
– కృష్ణమూర్తి, సోషల్ వర్కర్, బుజబుజనెల్లూరు

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు