
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ‘ఛలో మెడికల్ కాలేజీ’ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.

రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. నోటీసులు, పోలీసుల ఆంక్షలు దాటుకుని కీలక నేతలు, పార్టీ యువజన విభాగం, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంది.

వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్ ద్వారా లక్షన్నర కోట్ల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.





















