
పేదల కోసం సహకార సంఘాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అంతర్జాతీయ సహకార సంవత్సరం – 2025 సందర్భంగా పేద, అల్పాదాయ వర్గాల కోసం సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు డీసీఓ గుర్రప్ప తెలిపారు. నగరంలోని డీసీఓ కార్యాలయంలో గురువారం నెల్లూరు మహోద్యయ పరస్పర సహాయక సహకార సంఘ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో వివిధ వృత్తులకు చెందిన అల్పాదాయ వర్గాలను కలిసి సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తే సభ్యులు ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. అనంతరం సభ్యులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీసీఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో 48.651 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 48.651 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశ యం నుంచి కండలేరుకు 10.100 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ఇక్కడి నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,150, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.