
భక్తులకు పంచేందుకు 250 కిలోల గంధం
అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని హజరత్ ఖాజా రహంతుల్లా దర్గాలో గంధ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులకు 250 కిలోల గంధాన్ని పంచేందుకు సిద్ధం చేశారు. నగారాఖానా సెంటర్ నుంచి దర్గా వరకు విద్యుత్ కాంతులతో లైట్లను ఏర్పాటు చేశారు. దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా దాదాపు 34 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పర్యవేక్షిస్తున్నామని ఈఓ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. గంధ మహోత్సవాన్ని ఫయాజ్ అహమ్మద్ ఇంటి నుంచి దర్గాకు ఎత్తుకెళ్లేలా వక్ఫ్‌బోర్డు నిర్ణయించిందని, ఆ మేరకు ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. దీపారాధనను హఫీజ్‌పాషా నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
గంధాన్ని దంచేందుకు పోటీపడిన మహిళలు
గంధ మహోత్సవం సందర్భంగా మహల్ వద్ద గంధాన్ని దంచేందుకు మహిళలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. వీరిని పోలీసులు అదుపుచేస్తూ ఒక్కొక్కరిగా అనుమతించారు. ఇతర రాష్ట్రాల మహిళా భక్తులు భారీగా విచ్చేశారు.