ఇన్‌చార్జి డీఆర్‌ఓగా విజయకుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి డీఆర్‌ఓగా విజయకుమార్‌

Sep 2 2025 9:07 AM | Updated on Sep 2 2025 9:07 AM

ఇన్‌చ

ఇన్‌చార్జి డీఆర్‌ఓగా విజయకుమార్‌

నెల్లూరు రూరల్‌: జిల్లా ఇన్‌చార్జి రెవె న్యూ అధికారిగా విజయ్‌కుమార్‌కు కలెక్టర్‌ ఓ ఆనంద్‌ సోమ వారం అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీఆర్వోగా ఉన్న హుస్సేన్‌సాహెబ్‌ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా ఉన్న విజయ్‌కుమార్‌ను నియమించారు. విజయకుమార్‌ గతంలో కోవిడ్‌ సమయంలో నోడల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దు

పొదలకూరు: పొదలకూరు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మల్లిక చిట్టెమ్మ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ డీపీఓ శ్రీధర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులను సర్పంచ్‌ దుర్వినియోగం చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, స్థానిక టీడీపీ నేతలు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీఎల్‌పీఓ ద్వారా విచారణ నిర్వహించగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు రుజువైనట్లు పేర్కొన్నారు. ఆరు నెలల పాటు నిధులు డ్రా చేసే అధికారం లేకుండా చెక్‌పవర్‌ రద్దు చేసినట్టు తెలిపారు. అయితే సర్పంచ్‌ చిట్టెమ్మ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే తన చెక్‌పవర్‌ రద్దు చేయించారని ఆరోపించారు. పంచాయతీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని తమ వద్ద నిధుల ఖర్చుకు సంబంధించి ఆధారాలు ఉన్నట్లు వెల్లడించారు.

టీజీపీ ఇన్‌చార్జి

స్పెషల్‌ కలెక్టర్‌గా ఆసిఫా

నెల్లూరు (అర్బన్‌): తెలుగుగంగ ప్రాజెక్ట్‌ ఇన్‌చార్జి స్పెషల్‌ కలెక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్‌ ఆసిఫాను నియమిస్తూ కలెక్టర్‌ ఆనంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు టీజీపీ స్పెషల్‌ కలెక్టర్‌గా ఉన్న హుస్సేన్‌సాహెబ్‌ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఆమెను నియమించారు. ఆసిఫా ప్రస్తుతం ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కలెక్టర్‌ ఉత్తర్వులతో ఇప్పుడు అదనంగా టీజీపీ ఇన్‌చార్జి స్పెషల్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌

నియామకంపై కోర్టు స్టే

ఉదయగిరి: ఉదయగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నియామకంపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌ పదవి మొదట ఓసీ మహిళకు కేటాయించారు. అయితే కలెక్టర్‌ గత నెల 14న జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు సాయంత్రం ఓసీ మహిళకే కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. జలదంకి ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు బీసీలకే చైర్మన్‌ పదవి కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. ఈ నెల 3వ తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశింది. ఈక్రమంలో బీసీ నేతలు బి.మాధవరావు, శ్రీనివాస్‌ యాదవ్‌, లలితారం యాదవ్‌ సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి ఏఎంసీ చైర్మన్‌ పదవి బీసీలకే కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ప్రభుత్వ భూములు

ఆక్రమిస్తే కఠిన చర్యలు

మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమించే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు కబ్జాదారులను హెచ్చరించారు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘ప్రభుత్వ భూములు హాంఫట్‌’ కథనానికి అధికారులు స్పందించారు. ఆర్‌ఐ సాయికిరణ్‌, పెగళ్లపాడు వీఆర్‌ఓ శ్యాం, సర్వేయర్లు పెగళ్లపాడులోని ఆయా సర్వే నంబర్లలోని ఆ భూములను పరిశీలించి ఎవరైనా ప్రభుత్వ భూముల్లో దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు కూడా నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు తమ ఈ భూ ములకు సంబంధించి పట్టాలిచ్చి ఉన్నారని అధికారులకు దృష్టికి తీసుకురావడంతో ఆ పట్టాలను తీసుకుని వచ్చి వెబ్‌ ల్యాండ్‌లో భూమిపై హక్కు లు సరిచూసుకోవాలని సూచించారు. వెబ్‌ ల్యాండ్‌లో భూమి లేకుండా ఎవరైనా దిగితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇన్‌చార్జి డీఆర్‌ఓగా విజయకుమార్‌ 
1
1/2

ఇన్‌చార్జి డీఆర్‌ఓగా విజయకుమార్‌

ఇన్‌చార్జి డీఆర్‌ఓగా విజయకుమార్‌ 
2
2/2

ఇన్‌చార్జి డీఆర్‌ఓగా విజయకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement