
మహానేత దూరదృష్టి.. అభివృద్ధి సృష్టి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దూరదృష్టితో అభివృద్ధి సృష్టించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 169 కి.మీ. పొడవైన సముద్ర తీరంలో మధ్య భాగం కృష్ణపట్నంలో పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులతో ప్రపంచ స్థాయిలో సింహపురి కీర్తిని నిలిపారు. ఈ పోర్టు ద్వారా జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు బీజాలు వేశారు. జిల్లాకే కాకుండా రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు ఆదాయవనరుగా మార్చారు. మరో వైపు అదే ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో 2,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టి.. జిల్లాలో వెలుగులు నింపారు.