
ఎన్టీఏ జిల్లా కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు(టౌన్): నోబెల్ టీచర్స్ అసోసియేషన్ (ఎ న్టీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. స్థానిక ఎన్టీఏ జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నాటకం తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ చెన్నయ్య, గౌరవాధ్యక్షుడిగా వెంకటరాజు, క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు ఇన్‌చార్జిగా రహంతుల్లా నియమితులయ్యారు. సమావేశంలో ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులురాజు, నాయకులు వెంకరావు, జయప్రకాష్ నాయుడు, రెడ్డి రమే ష్, జిల్లా నాయకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, రఫీ, సురేష్, హరేంద్ర తదితరులు పాల్గొన్నారు.