
జోనల్–4 ప్రెసిడెంట్‌గా కాకాణి పూజిత
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జోన్ల వారీగా రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజితను నెల్లూరు, ప్రకాశం, అన్నమ్మయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల(జోన్–4)కు వర్కింగ్ ప్రెసిడెంగ్‌గా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, దాదాపు 70 రోజులుగా జిల్లా జైల్లో అక్రమ నిర్బంధంలో ఉంచింది. కాకాణిని అరెస్ట్ చేసి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీని బలహీనపరచాలని కూటమి నేతలు భావించారు. తన తండ్రిని జైల్లో పెట్టిన తర్వాత పార్టీ కేడర్‌కు తానున్నాంటూ భరోసా కల్పిస్తూ పార్టీ నేతలకు అండగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పూజిత సేవలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తిస్తూ పార్టీ జోనల్ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.