
జలాశయానికి కృష్ణా జలాలు
● 36 టీఎంసీలు దాటిన సోమశిల
సోమశిల: జలాశయానికి కృష్ణా జలాల ఇన్‌ఫ్లో క్రమక్రమంగా పెరుగుతోంది. కృష్ణా జలాలు రాక ముందు 28.660 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. మంగళవారం నాటికి 36 టీఎంసీలు దాటింది. జలాశయానికి గత నెల 11వ తేదీ నుంచి వరద జలాలు వస్తున్నాయి. మంగళవారం నాటికి 14,105 క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు క్రస్ట్‌గేట్ల ద్వారా 1100, పవర్ టర్నెల్ ద్వారా 2,500, ఉత్తరకాలువకు 370, కండలేరు కాలువకు 6 వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు.