
ఇతర జిల్లాల రైస్‌మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లు
నెల్లూరు (పొగతోట): రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఇతర జిల్లాల రైస్‌మిల్లర్లతో ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా చర్యలు చేపడుతున్నామని డీఎస్‌ఓ విజయకుమార్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో ప్రకాశం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల రైస్‌మిల్లర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు నుంచి కోతలు ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో, జిల్లానే కాకుండా ఇతర జిల్లాల రైస్‌మిల్లర్లతో కొనుగోలు చేయించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రైతులు నష్టపోకుండా ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నామని పేర్కొన్నారు. సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీకి
ఓట్లు వేశామని..
● దౌర్జన్యంగా ఆక్రమించి రోడ్డు వేశారు
నెల్లూరురూరల్: గత ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశామనే అక్కసుతో మా పట్టా పొలంలో టీడీపీ వర్గీయులు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామస్తులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిక్కవరపాడులోని సర్వే నంబర్ 2120–2, 5, 9ల్లో 7.68 ఎకరాల విస్తీర్ణంలో తమకు వారసత్వంగా 3.48 ఎకరాల వ్యవసాయ భూమి సంక్రమించిందని తెలిపారు. మా పొలానికి చుట్టు పక్కల ఉన్న టీడీపీ నేతలు అధికార, అంగబలంతో ఈ నెల 2, 3 తేదీల్లో శని, ఆదివారాల్లో జేసీబీలు, ట్రాక్టర్లతో అక్రమంగా రోడ్డు నిర్మాణం సాగించారని వాపోయారు. ఆ సమయంలో తాము పొలం దగ్గర ఉండి ఉంటే చంపేసే వాళ్లని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే, రెవెన్యూ కోర్టు ఆర్డర్లను ధిక్కరించి రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధితులు తెలిపారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో బాధితులు తమలపాకుల ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, రామయ్య, పద్మమ్మ, శ్రీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరురూరల్: జిల్లాలోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో 12 ప్రాజెక్ట్‌ల పరిధిలోని 28 అంగన్‌వాడీ కార్యకర్తలు, 168 అంగన్‌వాడీ హెల్పర్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 26వ తేదీ సాయంత్రంలోగా అభ్యర్థులు తమ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, జూలై 2025 నాటికి 21 సంవత్సరాలు నిండి, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. వివాహిత మహిళ అయి ఉండాలని, అవివాహితులు అనర్హులని తెలిపారు. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రూల్ ఆఫ్ రిజిర్వేషన్ మేరకు జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఏ కులం నిర్ణయించబడిందో సదరు కులానికి చెందిన వారే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్స్‌లోని పోస్టులకు ఆయా సామాజికవర్గాలు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్‌లోని పోస్టులకు 10వ తరగతి పాసైన వారు లేని పక్షంలో ఆ తదుపరి తరుగతుల వారు అర్హులన్నారు. ఆయా ఖాళీల వివరాలను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ నోటీసు బోర్డుల్లో ప్రచురించడం జరుగుతుందన్నారు. సీడీపీఓలు పత్రిక ప్రకటనల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు.
కిలో పొగాకు
గరిష్ట ధర రూ.280
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 331 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 212 బేళ్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి శివకుమార్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160 పలుకగా, సరాసరి రూ.226.79 లభించిందన్నారు. వేలంలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వివరించారు.

ఇతర జిల్లాల రైస్‌మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లు