
ఉన్నత పాఠశాలల్లో వసతుల పరిశీలన
ఉదయగిరి రూరల్: ఉదయగిరి, వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులను రాష్ట్ర వి ద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య అదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తరగతులను నూతనంగా నిర్మించిన భవనాలకు మార్చాలని, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన నిధులను వారంలో విడుదల చేస్తామని చెప్పారు. వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుడు షరీఫ్‌బాషా, ఉదయగిరి ఎంఈఓలు మస్తాన్‌వలీ, తోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.