
మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలకు అవకాశం
నెల్లూరు సిటీ: జిల్లాలో ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసిన గ్రామ / వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు.. ప్రత్యేక కేటగిరీలో ఉన్న వారు.. రిక్వెస్ట్ నిమిత్తం బదిలీలు కోరేందుకు అవసరమైన వివరాలతో కూడిన ఆప్షన్ ఫారాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సమర్పించాలని పోలీస్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సొంత మండలం లేదా ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయంలో స్థానాన్ని ఇవ్వబోమని చెప్పారు. ఫారాల్లో తప్పుడు సమాచారమిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనుమసముద్రంపేట: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన అనుమసముద్రంలోని హజరత్ సయ్యద్‌షా ఖాదరీ బాబా దర్గా వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ సొమ్మసిల్లారు. దీంతో 108లో ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు.