
అవగాహన కల్పించాలి
ఆరోగ్యమంటే మందులు, చికిత్సతోనే రాదు. పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, పరిసరాల పరిశుభ్రత, మంచి ఆరోగ్య అలవాట్లతో నూటికి 80 శాతం జబ్బులు రాకుండా అరికట్టవచ్చు. రోగం వచ్చిన తర్వాత కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జబ్బులకు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం వైద్యశాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీఓలు కలిసి ప్రజల్లో అవగాహన పెంచాలి. ఆపరేషన్లు, ఇతర వైద్యసేవలను ప్రైవేట్ వైద్యశాలలు కూడా తక్కువ ఖర్చుతోనే రోగులకు అందించేలా చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్,
పీపీ యూనిట్
●