
పాఠశాలలను ఎత్తేయడం అన్యాయం
యానాది కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలను ఎత్తేయడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి అన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మల్లి మాట్లాడుతూ బోగోలు మండలంలోని కొండబిట్రగుంట యానాది కాలనీలో 46 మంది విద్యార్థులున్న పాఠశాలను పక్క గ్రామంలోని స్కూల్లో విలీనం చేయడం దారుణమన్నారు. దళిత, గిరిజనులకు విద్య లేకుండా చేయడం అన్యాయమన్నారు. 80 మంది యానాది పిల్లలకు తల్లికి వందనం రాలేదన్నారు. కార్యక్రమంలో ఎస్.లక్ష్మయ్య, అశోక్, రాచగిరి మురళి, పి.హరిబాబు, 150 మంది మహిళలు పాల్గొన్నారు.