
అందుబాటులో వైద్యం
ఆరోగ్యం అనేది ప్రజల హక్కు. ప్రజారోగ్యాన్ని పేద, ధనిక తేడా లేకుండా అందరూ సమానంగా పొందగలగాలి. ఇందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. వైద్యాన్ని ప్రైవేట్‌పరం చేయకూడదు. వైద్యకళాశాలలను ప్రభుత్వం నిర్వహించాలి. బడ్జెట్‌లో వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలి. మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీ తొలగించాలి. అప్పుడే ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది.
– డాక్టర్ ఎంవీ రమణయ్య,
ప్రజారోగ్యవేదిక
రాష్ట్ర అధ్యక్షుడు