
సిలిండర్ల చోరీ కేసులో దొంగల అరెస్ట్
నెల్లూరు సిటీ: డెలివరీ బాయ్స్‌ను ఏమార్చి 23 సిలిండర్లను అపహరించిన కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సంతపేట సీఐ దశరథరామారావు స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది గత నెల 28, 29 తేదీల్లో సిలిండర్లను డెలివరీకి తీసుకెళ్లగా దొంగలు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4వ మైలుకు చెందిన పి.కార్తీక్, విడవలూరు మండలంలోని చవటపాళేనికి చెందిన పి.అనూష్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రూ.1.15 లక్షల విలువైన 23 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.