
లారీలో నుంచి పడి క్లీనర్ మృతి
కోవూరు: జాతీయ రహదారిపై వినాయక స్వామి గుడి సమీపంలో సోమవారం విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీలో నుంచి నారాయణ (37) అనే క్లీనర్ నిద్రమత్తులో అదుపుతప్పి కింద పడిపోయాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు నారాయణ మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై రంగనాథ్ గౌడ్ పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.