
కమిషనర్‌పై కలెక్టర్‌కు కౌన్సిలర్ ఫిర్యాదు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణపై 16వ వార్డు కౌన్సిలర్ ప్రమీలమ్మ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టణంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 16 వార్డులో సమస్యలపై అనేకసార్లు వివిధ సర్వసభ్య సమావేశాల్లో తెలిపినా కమిషనర్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపడం లేదని వివరించారు. మార్చి నెల నుంచి వార్డులో తాగునీటి సమస్య, దోమల సమస్య ఎక్కువగా ఉందన్నారు. దీనిపై కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఇటీవల నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న 13మంది పారిశుద్ధ్య కార్మికులను తొలగించారన్నారు. కొత్తగా చేరిన వారిని ఆప్కాస్‌లో చేర్చారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే కమిషనర్ తనకు ఎలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చారని పేర్కొన్నారు. నగర పంచాయతీలో పన్నుల వలన రూ.కోటి, కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.కోటి ఉన్నా అభివృద్ధి పనుల్లో పక్షపాతం చూపుతున్నారన్నారు. కొన్ని వార్డుల్లో పనులు చేస్తూ మరికొన్ని వార్డులపై వివక్ష చూపడం సమంజసం కాదని కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుత్ షాక్‌తో
యువకుడి మృతి
ఇందుకూరుపేట: ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గంగపట్నం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గడ్లకాలువ సమీపాన ఉన్న గిరిజన కాలనీకి రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న పులి మురళి(29) మరమ్మతులు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకొన్న ఎస్సై నాగార్జునరెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు.
భార్య, కుమార్తె అదృశ్యంపైపోలీసులకు భర్త ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): తల్లి, కుమార్తె అదృశ్యమైన ఘటనపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు ఆచారివీధిలో కిశోర్‌కుమార్ నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అప్పుడప్పుడు హుబ్లిలోని తన పుట్టింటికి వెళ్లి కొద్దిరోజుల అనంతరం తిరిగి భర్త వద్దకు వచ్చేది. ఈనెల 23వ తేదీన కిశోర్‌కుమార్ పనికి వెళ్లారు. ఈ క్రమంలో భర్తకు ఫోన్ చేసి నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఉన్నానని, కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది. దీంతో భర్త, బంధువులు రైల్వేస్టేషన్‌కు వెళ్లిచూడగా తల్లి, కుమార్తె కనిపించలేదు. హుబ్లీకి ఫోన్ చేసి అడుగగా అక్కడకు రాలేదని తెలిసింది. ఈమేరకు కిశోర్‌కుమార్ సోమవారం సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆధార్ సీడింగ్‌తోనే
సంక్షేమ లబ్ధి
నెల్లూరు రూరల్: ఆధార్ సీడింగ్ చేయించుకోని వారికి పింఛను, సంక్షేమ పథకాల నిలిపివేతకు అవకాశం ఉందని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సీడింగ్, బ్యాంక్ లింకింగ్, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయించుకోని పింఛనుదారులకు నగదు చెల్లింపు నిలిపివేసిన విషయం తెలిసిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రా న్స్‌ఫర్ పథకాల అమలులో భాగంగా ప్రతి లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా ఆధార్‌తో ఎన్‌పీసీఐ ద్వా రా మ్యాప్ అయి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్ర త్యేక డ్రైవ్ ద్వారా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయడం జరిగిందని అన్నారు. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తిగా చేయించుకోని పక్షంలో పింఛను, ఇతర ప్రభుత్వ పథకాల నగదు లభించకపోవచ్చునని, వెంటనే ఐపీపీబి బ్యాంక్ ద్వారా ఆధార్ మ్యాపింగ్ పూర్తి చేయించుకోవాలని కోరారు.
పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్: రూ.130
లేయర్ రూ.110
బ్రాయిలర్ చికెన్: రూ.234
స్కిన్‌లెస్ చికెన్: రూ.260
లేయర్ చికెన్: రూ.187