
ప్రశ్నించే గొంతు నొక్కడం దారుణం
– మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే గొంతులు నొక్కేలా ప్రభుత్వం, అధికారులు ప్రవర్తించ డం దారుణమని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రక టనలో ఖండించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఈ ప్రభు త్వం అమలు చేస్తుందన్నారు. అక్రమంగా మైనింగ్ కేసులో కాకాణిని ఇరికించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయకపోగా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల నోరు నొక్కుతోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడరని, తామంతా కాకాణికి అండగా ఉంటామన్నారు. కూటమి పాలనను, జరుగుతున్న అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంంగా ఉన్నారన్నారు.