కాకాణి అరెస్ట్‌ అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

కాకాణి అరెస్ట్‌ అప్రజాస్వామికం

May 28 2025 12:21 AM | Updated on May 28 2025 5:45 PM

కాకాణి అరెస్ట్‌ అప్రజాస్వామికం

కాకాణి అరెస్ట్‌ అప్రజాస్వామికం

– మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఉదయగిరి: కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతుండడం రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో కూటమిపై పెరుగుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగిందన్నారు. మైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పాత్ర లేని మాజీ మంత్రి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అందరూ కలిసికట్టుగా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement