
నోటీసులు జారీ చేస్తున్నాం
అధిక ఫీజుల వసూళ్లు, నిబంధనల ప్రకారం లేని పాఠశాలలు, రకరకాల పేర్లతో ఉన్న పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. వారు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి నిబంధనల ప్రకారం లేని పాఠశాలలకు నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నారు. ప్రతి యాజమాన్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. పాఠశాలకు సంబంధించి టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ వివరాలు, వారికిచ్చే వేతనాలు, పాఠశాల పూర్తి వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఆ ప్రకారం ప్రతి పాఠశాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. – బాలాజీరావు, డీఈఓ
●