ముగిసిన నెట్‌బాల్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

ముగిసిన నెట్‌బాల్‌ పోటీలు

Published Sun, Nov 12 2023 12:44 AM

-

ఆత్మకూరు: రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ నెట్‌బాల్‌ అండర్‌ – 17 బాలబాలికల పోటీలు శనివారంతో ముగిశాయి. ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన సుమారు 360 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఫైనల్స్‌ను శనివారం నిర్వహించారు. బాలుర విభాగ ఫైనల్స్‌లో పశ్చిమగోదావరి జట్టు విశాఖపట్నంపై 10 – 08 గోల్స్‌తో విజయం సాధించింది. నెల్లూరు జట్టు అనంతపురంపై 12 – 07 గోల్స్‌తో గెలుపొంది తృతీయ స్థానంలో నిలిచింది.

● బాలికల విభాగంలో విశాఖ జట్టు పశ్చిమ గోదావరిపై 08 – 07 గోల్స్‌తో విజయం సాధించింది. నెల్లూరు జట్టు తూర్పుగోదావరిపై 11 – 05 గోల్స్‌తో గెలుపొంది తృతీయ స్థానంలో నిలిచింది. విజేతలకు షీల్డ్‌, ప్రశంసపత్రాలను ఎస్జీఎఫ్‌ మేనేజర్‌ మహబూబ్‌ చేతుల మీదుగా అందజేశారు. సాంబశివ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు కంచి పరమేశ్వరరెడ్డి భోజన ఏర్పాట్లు చేశారు. పీడీలు విజయ్‌, తిరుపతయ్య, కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి, బీజేపీ నేత కుడుముల సుధాకర్‌రెడ్డి, ప్రైవేట్‌ పాఠశాలల సంఘ అధ్యక్షుడు మల్లికార్జున, పీఈటీ సురేష్‌, హెచ్‌ఎం అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement