మరో వివాదంలో చహల్‌ | Yuzvendra Chahal's Private Messages Leaked By Taniya Chatterjee In The Midst Of IPL 2026 | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో చహల్‌

Apr 13 2026 12:04 PM | Updated on Apr 13 2026 12:28 PM

Yuzvendra Chahal's Private Messages Leaked By Taniya Chatterjee In The Midst Of IPL 2026

పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ వివాదాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారాడు. భార్యతో విడాకులు, ఆతర్వాత పలువురు అమ్మాయిలతో డేటింగ్‌ పుకార్లు.. కొద్ది రోజుల కిందట సిగరెట్‌ వివాదం, తాజాగా ఓ నటితో అసభ్య వ్యవహారం. ఇలా చహల్‌ అనునిత్యం ఏదో వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.

తాజా వివాదం ఏంటంటే..?
చహల్‌.. కోల్‌కతాకు చెందిన నటి, మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయిన తానియా చటర్జీకి ఓ మెసేజ్‌ పెట్టాడు. దీన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా బహిర్గతం చేసింది. చహల్‌ తన వీడియో క్లిప్‌లను షేర్‌ చేస్తూ 'cute' అని కామెంట్‌ చేసినట్లు ఓ వీడియో ద్వారా వెల్లడించింది.  

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియోలో చహల్‌ పంపిన Instagram DM చూపించింది. ఈ వీడియోలో మాట్లాడుతూ.. నేను వ్యక్తిగతంగా చహల్‌ను ఎప్పుడూ కలవలేదు. ఆయన మెసేజ్‌ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఆ మెసేజ్‌కు పెద్దగా స్పందించలేదు. ఆలస్యంగా చూసినందున సంభాషణ కొనసాగలేదని తెలిపింది.  

ఈ వీడియోను చూసిన అనంతరం నెటిజన్లు చహల్‌ను తిట్టిపోస్తున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ ఫైరవుతున్నారు. బుద్ది మార్చుకోకపోతే ఐపీఎల్‌ అవకాశాలు కూడా ఉండవని హెచ్చరిస్తున్నారు.

కాగా, కొద్ది రోజుల కిందట చహల్‌కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్‌మీడియాలో రచ్చ చేసింది. చహల్‌గా భావిస్తున్న వ్యక్తి లగ్జరీ కారులో కూర్చొని సిగరెట్‌ తాగుతూ కనిపిస్తాడు. ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా కాల్చిన సిగ‌రేట్‌ను ఆర్పకపోవడం విమర్శలకు కారణమైంది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్‌ కాల్చడమే నేరం. అలాంటిది దాన్ని ఆర్పాలన్న సోయి కూడా లేకుండా రోడ్డుపై పడేయటాన్ని నెటిజన్లు తప్పుబట్టారు.

ఇంతకీ ఎవరీ తానియా చటర్జీ..?  
- తానియా చటర్జీ కోల్‌కతాకు చెందిన నటి, మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌.  
- ఆమె గాంది బాత్‌సీజన్‌ 4, క్లాస్‌ ఆఫ్‌ 2020 సీజన్‌ 2 వంటి వెబ్‌ సిరీస్‌లలో నటించింది.  
- Ullu యాప్‌లో పలు సిరీస్‌లలోనూ కనిపించింది.  

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ సీజన్‌లో చహల్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వాస్తవానికి గత కొద్ది సీజన్లుగా అతని ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే జాతీయ జట్టు అవకాశాలను సైతం కోల్పోయాడు. ఈ సీజన్‌లో చహల్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్‌ కూడా చాలా ఎక్కువగా (8.20) ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement