
ఐపీఎల్-2023లో రాజస్తాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపుతున్నాడు. గురువారం జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కాగా జైస్వాల్‌కు ఇదే ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ 304 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక ఓపెనర్‌గా వచ్చి విధ్వంసం సృష్టిస్తున్న 21 ఏళ్ల జైస్వాల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: Anjali Sarvani: కర్నూల్ అమ్మాయికి బంపరాఫర్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న జైస్వాల్‌కు భారత జట్టులో అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది టీ20ల్లో కిషన్‌ను పక్కన పెట్టి జైస్వాల్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా జైస్వాల్ దేశీవాళీ టోర్నీల్లో కూడా అదరగొట్టాడు. గతేడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా యశస్వి అద్భుత ప్రదర్శరన కనబరిచాడు. ఈ టోర్నీల్లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 266 పరుగులు సాధించాడు.
చదవండి: Wrestlers Protest: దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు