'టీమిండియాదే ప్ర‌పంచ‌క‌ప్‌.. య‌ష్ ధుల్ మ‌రోసారి చెల‌రేగ‌డం ఖాయం'

World Cup will come to India, Yash Dhulls father backs India - Sakshi

Yash Dhull Father About U19 WC Finals: అండ‌ర్-19 ప్రపంచ క‌ప్‌లో టీమిండియా వ‌రుస‌గా నాలుగో సారి ఫైన‌ల్‌కు చేరింది.  సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి యువ భార‌త్ ఫైన‌ల్లో అడుగు పెట్టింది. కాగా భార‌త విజ‌యంలో కెప్టెన్ యష్ ధుల్ 110 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించాడు. ఇక శ‌నివారం జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో యష్ ధుల్ తండ్రి విజయ్ ధుల్ కీల‌క వాఖ్య‌లు చేశాడు. అండ‌ర్-19 ప్రపంచ క‌ప్ టైటిల్‌ను భార‌త్ కచ్చితంగా కైవ‌సం చేసుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

అదే విధంగా య‌ష్ క్రికెట్ ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు, భార‌త్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌డంలో య‌ష్ కీల‌క పాత్ర పోషిస్తాడు అని అత‌డు తెలిపాడు. ‘‘భారత్‌కు కచ్చితంగా ప్ర‌పంచ‌క‌ప్ వ‌స్తుంది. ఈ టోర్న‌మెంట్‌లో యువ భార‌త్ జ‌ట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఇంగ్లండ్ జ‌ట్టు కూడా గ‌ట్టి పోటీస్తుంది అన‌డంలో సందేహం లేదు. దేశం మొత్తం టీమిండియా వెనుక ఉంది. ఫైన‌ల్లో భార‌త్ గెలిచి చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని అంద‌రూ అశిస్తున్నారు.

య‌ష్ క్రికెట్ ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు. జ‌ట్టు క‌ష్ట‌ప‌రిస్ధితుల్లో ఉన్న‌ప్ప‌డు బ్యాట‌ర్‌గా, సార‌ధిగా తాను ఎంటో నిరూపించుకుంటాడు. ఆదే విధంగా ఏ బ్యాట‌ర్‌కు ఏ బౌలర్‌ను ఊపయోగించాలో అత‌డికి బాగా తెలుసు’’ అని విజయ్ ధుల్ పేర్కొన్నాడు. ఇక భారత అండర్‌–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్‌ మొహమ్మద్‌ కైఫ్‌), 2008లో (కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి), 2012లో (కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌), 2018 (కెప్టెన్‌ పృథ్వీ షా) జట్టు చాంపియన్‌గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

చ‌ద‌వండి: నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా: శిఖర్ ధావన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top