ఐపీఎల్-2026కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం(మార్చి 28) ఈ నుంచి ధానాధన్ క్రికెట్ లీగ్ షూరు కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే అందరి దృష్టి టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనిపైనే ఉంది.
42 ఏళ్ల ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని, తన రిటైర్మెంట్ గురించి అనవసర చర్చలు పెడుతున్నారని యోగ్‌రాజ్ మండిపడ్డాడు.
"ధోని ఫిట్‌గా కన్పిస్తున్నాడు. ప్రతీ సీజన్‌లోనూ సరైన క్రమశిక్షణ, అంకితభావంతో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికీ అతడిలో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. అతడి మోచేతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ధోని ఒక అద్భుతం. అతడు రిటైర్ అవ్వాలని చెప్పడానికి అసలు వీళ్లెవరు? అనవసర చర్చలు పెడుతున్నారు.
అతడు మరో పదేళ్లు ఆడాలి. క్రికెట్ పరంగా ధోనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ పేర్కొన్నాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా ధోనిపై విమర్శలు గుప్పించే యోగ్‌రాజ్.. ఈసారి మిస్టర్ కూల్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం.
మరోవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్‌కేకు వచ్చిన సంజూ శాంసన్ధో.. ధోనికి సరైన వారసుడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 30న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. సీఎస్‌కే జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.
చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?


