ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి రాజస్తాన్‌కు శుభారంభాలు అందిస్తున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 400 పరుగులు సాధించాడు.
ఫాస్టెస్ట్ సెంచరీలు
తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-3లో కొనసాగుతున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో పనిలేకుండా బంతిని బాదడమే తన పని అంటున్న వైభవ్.. వరల్డ్‌క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా చుక్కలు చూపించాడు.
బుమ్రాను వదల్లేదు
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా బుమ్రాకు సిక్సర్‌తో స్వాగతం పలికిన 15 ఏళ్ల వైభవ్.. అతడి బౌలింగ్‌లోనే మరో సిక్స్ కూడా పిండుకున్నాడు. దీంతో మహామహ బౌలర్లు సైతం వైభవ్ విధ్వంసానికి అడ్డుకట్ట వేడయం ఎలా? అంటూ తలలు పట్టుకుంటున్నారు.
వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే..
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరును ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం, క్రిక్‌ఇన్ఫో కామెంటేటర్ ఇయాన్ బిషప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టెక్నికల్‌గా చెప్పాలంటే... అతడి బ్యాట్ స్వింగ్ అయ్యే విధానం యూనిక్‌గా ఉంటుంది. బేస్‌బాల్ మాదిరి స్వింగ్ అని చెప్పవచ్చు.
We’ve seen this shot before 🚁 😉
Vaibhav Sooryavanshi gives Rajasthan Royals the perfect start in this chase. 💪#TATAIPL 2026 ➡️ #PBKSvRR | LIVE NOW 👉https://t.co/saW6caCqT8 pic.twitter.com/A5EgtrJ0Sp— Star Sports (@StarSportsIndia) April 28, 2026
బ్యాటింగ్‌లో అతడి బలహీనత ఏమిటో కచ్చితంగా ఇదీ అని చెప్పడం కష్టం. అయితే, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ (సాధారణంగా బ్యాటర్‌కు 7-8 మీటర్ల దూరంలో బాల్‌ను సంధిస్తే.. బంతి ఎక్కువగా బౌన్స్ అయి బ్యాటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది)తో అతడిని బోల్తా కొట్టించవచ్చు.
పొరపాటున మిస్సయిందో!
అయితే, బంతి త్వరగా టాప్ ఎడ్జ్‌కు గనుక రాకపోతే.. అతడు ఆ బాల్‌ను సిక్సర్‌గా మలచడం ఖాయం. అందుకే వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటో కచ్చితంగా చెప్పలేమని ముందే చెప్పాను’’ అని ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు.
కాగా కేవలం టీ20లలోనే కాకుండా వైభవ్ భారత్ అండర్-19 జట్టు తరఫున ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ ఇటీవల వరల్డ్‌కప్ గెలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు.
చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!


