WC 2023- Ind vs Pak: పాక్‌ గుండు సున్నా.. రోహిత్‌ ఒక్కడే 27! ఇదీ మీ లెవల్‌ అంటూ..

WC 2023 Ind vs Pak Sixes Hit in Powerplay ODIs in 2023 Pak 0 Rohit 27 Fans Reacts - Sakshi

ICC ODI World Cup 2023- India vs Pakistan: క్రికెట్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య శనివారం మ్యాచ్‌ ఆరంభమైంది. అహ్మదాబాద్‌ వేదికగా దాయాదులు పోటీకి దిగగా.. లక్ష్య సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం నీలి వర్ణంతో నిండిపోయింది.

రోహిత్‌ సేనకు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. టీమిండియాను చీర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌,ప్రధాన పేసర్‌ జస్‌‍ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించగా.. తొలి ఓవర్లో పాక్‌ కేవలం 4 పరుగులు మాత్రమే రాబట్టలిగింది.

బుమ్రా పొదుపుగా
అయితే, రెండో ఓవర్లో మరో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 16 పరుగులిచ్చాడు. సిరాజ్‌ బౌలింగ్లో ఇమామ్‌ మూడు ఫోర్లు బాదాడు. తదుపరి ఓవర్లో బుమ్రా మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు.

అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన సిరాజ్‌.. 6 పరుగులివ్వగా.. అనంతరం బుమ్రా 5వ ఓవర్లో మ్యాజిక్‌ చేశాడు. కేవలం ఒక్క పరుగుకే పాక్‌ను పరిమితం చేశాడు.

తొలి వికెట్‌ తీసిన సిరాజ్‌
ఇక ఆ తర్వాత వరుస ఓవర్లలో సిరాజ్‌ 5, బుమ్రా 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఎనిమిదో ఓవర్‌ ఆఖరి బంతికి సిరాజ్‌.. అబ్దుల్లా షఫీక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అప్పటికి పాక్‌ స్కోరు 41.

తర్వాత హార్దిక్‌ పాండ్యా ఓవర్లో 7 పరుగులు రాబట్టిన పాకిస్తాన్‌.. 10వ ఓవరల్లో సిరాజ్‌ బౌలింగ్‌లో ఒక్క పరుగుకే పరిమితమైంది. ఇలా పవర్‌ ప్లే ముగిసే సరికి పాకిస్తాన్‌ వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది. ఇందులో ఒక్క సిక్సర్‌ కూడా లేదు.

పాక్‌ గుండు సున్నా.. రోహిత్‌ ఒక్కడే
కాగా 2023 ఏడాదిలో ఇప్పటి వరకు పాకిస్తాన్‌ ఆడిన 18 వన్డేల్లో పవర్‌ ప్లేలో ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయలేదు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఒక్కడే 16 ఇన్నింగ్స్‌లో కలిపి పవర్‌ ప్లేలో ఏకంగా 27 సిక్సర్లు బాదడం విశేషం.

నెట్టింట హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ సందడి
ఇందుకు సంబంధించిన గణాంకాలను నెట్టింట షేర్‌ చేస్తూ హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ పాక్‌ జట్టును టీజ్‌ చేస్తున్నారు. ‘‘మీరు 0, రోహిత్‌ ఒక్కడే 27.. ఇదీ మీ లెవల్‌ వారెవ్వా సిక్సర్ల కింగ్‌’’ అంటూ రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీమిండియా సారథి వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా సిక్సర్ల రారాజుగా రికార్డు సాధించాడు.

గేల్‌ రికార్డు బద్దలు కొట్టిన రో‘హిట్‌’
మూడు ఫార్మాట్లలో కలిపి 556 సిక్సర్లు పూర్తి చేసుకుని యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న రికార్డు(553) బద్దలు కొట్టాడు. కాగా అహ్మదాబాద్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో పాకిస్తాన్‌ 125 పరుగులు స్కోరు చేసింది. సిరాజ్‌, పాండ్యాకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

చదవండి: WC 2023: ముష్ఫికర్‌- షకీబ్‌ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్‌- సచిన్‌ రికార్డు బ్రేక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 11:41 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్‌ దశలోనే ఇంటిబాట పటి​న శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది....
14-11-2023
Nov 14, 2023, 10:32 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. బుధవారం జరుగబోయే...
14-11-2023
Nov 14, 2023, 08:13 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన భారత్‌, సౌతాఫ్రికా,...
14-11-2023
Nov 14, 2023, 07:34 IST
భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ (లీగ్‌) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన...
14-11-2023
Nov 14, 2023, 01:57 IST
సంపూర్ణం... లీగ్‌ దశలో భారత్‌ జైత్రయాత్ర! నెదర్లాండ్స్‌ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్‌ ప్రాక్టీస్‌తో టీమిండియా ముగించింది. టాపార్డర్‌ బ్యాటర్లు...
13-11-2023
Nov 13, 2023, 20:11 IST
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.  టోర్నీలో ఇప్పటికే 500కిపైగా పరుగులు చేసిన...
13-11-2023
Nov 13, 2023, 19:25 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్స్‌ సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో నవంబర్‌ 15 ముంబై వేదికగా...
13-11-2023
Nov 13, 2023, 18:35 IST
వన్డేప్రపంచకప్‌-2023 లీగ్‌ దశను అద్బుత విజయంతో ముగించిన టీమిండియా.. ఇప్పుడు సెమీఫైనల్‌లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా...
13-11-2023
Nov 13, 2023, 17:45 IST
వన్డే ప్రపంచకప్‌-2023 లీగ్‌ స్టేజీలో తొమ్మిది విజయాలతో ఆజేయంగా నిలిచిన ఇప్పుడు సెమీఫైనల్స్‌ సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో...
13-11-2023
Nov 13, 2023, 15:59 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్‌ జట్టు.. లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ బౌలింగ్‌...
13-11-2023
Nov 13, 2023, 15:28 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుసగా 9వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 160...
13-11-2023
Nov 13, 2023, 15:00 IST
వన్డే ప్రపంచకప్‌-2023 తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న బెంగళూరు వేదికగా జరిగిన భారత్‌-నెదర్లాండ్స్‌...
13-11-2023
Nov 13, 2023, 12:11 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పలు ప్రపంచకప్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత...
13-11-2023
Nov 13, 2023, 11:45 IST
వన్డే వరల్డ్‌కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్‌ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. ఆదివారం నెదర్లాండ్స్‌పై...
13-11-2023
Nov 13, 2023, 11:16 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌...
13-11-2023
Nov 13, 2023, 10:55 IST
నెదర్లాండ్స్‌పై విక్టరీతో వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్‌కప్‌...
13-11-2023
Nov 13, 2023, 09:28 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11...
13-11-2023
Nov 13, 2023, 08:48 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత...
13-11-2023
Nov 13, 2023, 08:18 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్‌...
13-11-2023
Nov 13, 2023, 07:38 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top