
సౌతాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరిసిన పాండ్యా అదే జోరును ఈ మ్యాచ్‌లో కంటిన్యూ చేయలేకపోయాడు. 9 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్ పార్నెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అంతకముందు బంతిని పాండ్యా బౌండరీ తరలించాడు. ఈ నేపథ్యంలో పార్నెల్ వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. రెండు చేతుల జోడించి హార్ట్ సింబల్ చూపించాడు.. ''పాండ్యా నువ్వంటే నాకు ఇంత ఇష్టం'' అన్నట్లుగా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక రెండో టి20లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆరంభంలోనే రుతురాజ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కొన్ని మెరుపులు మెరిపించినప్పటికి పెద్ద స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. శ్రేయాస్ 40 పరుగులతో రాణించినప్పటికి అతనికి అండగా నిలబడేవాళ్లు కరువయ్యారు. చివర్లో దినేశ్ కార్తిక్ 21 బంతుల్లో 30 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగలిగింది.
#WayneParnell pic.twitter.com/H0IUUqbL4Y
— Soni Gupta (@SoniGup46462554) June 12, 2022
చదవండి: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వేళ.. 'ఆ నవ్వు చూసి చాలా కాలమైంది'