కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్‌ రికార్డు

Virat Kohli On Verge Of Achieving Huge Milestone In ODIs - Sakshi

సిడ్నీ:  టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రేపు(శుక్రవారం) ఇరు జట్ల మధ్య జరుగనున్న తొలి వన్డేతో సిరీస్‌ ఆరంభం కానుంది. సిడ్నీ వేదికగా తొలి రెండు వన్డేలు జరుగుతుండగా, కాన్‌బెర్రాలో మూడో వన్డే జరుగనుంది.  దీనిలో భాగంగా పరుగుల మెషీన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డుకు చేరువగా ఉన్నాడు. గత ఏడేళ్లుగా నిలకడగా పరుగులు సాధిస్తూ  ఎ‍న్నో రికార్డులు సాధించిన కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. వన్డేల్లో 12వేల పరుగులు సాధించడానికి 133 పరుగుల దూరంలో ఉన్నాడు.  (మరో ప్రపంచానికి మారడోనా)

ఆసీస్‌తో 133 పరుగుల్ని సాధిస్తే  వన్డేల్లో 12వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న ఆరో క్రికెటర్‌గా నిలుస్తాడు. అదే సమయంలో 300 ఇన్నింగ్స్‌లు కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.  వన్డేల్లో  కోహ్లి ఇప్పటివరకూ  248 మ్యాచ్‌లకు గాను 239 ఇన్నింగ్స్‌ల్లో 11,867 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కోహ్లి యావరేజ్‌ 59.34గా ఉండగా, స్టైక్‌రేట్‌ 93.25గా ఉంది.మూడు వన్డేల సిరీస్‌,  మూడు టీ20ల సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు అందుబాటులో ఉండే కోహ్లి.. చివరి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. తొలి టెస్టు  తర్వాత కోహ్లి స్వదేశానికి పయనం కానున్నాడు. ఆ సమయానికి భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనిచ్చే  అవకాశం ఉండటంతో తొలి టెస్టు  తర్వాత కోహ్లి భారత్‌కు బయల్దేరతాడు. (ఔను... నేనింతే!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top