మనసు దోచుకుంటున్న విరాట్‌ సైగ

Virat Kohli Gesture For Anushka Sharma Winning Over Internet - Sakshi

ఐపీఎల్‌ 2020లో భారత  క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యం వహిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీం వరుస రెండు పరాజయాలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు బెంగుళూరు టీం ధోని సారథ్యం చెన్నైసూపర్‌ కింగ్స్‌తో తలపడి 8 వికెట్ల నష్టంతో ఓడిపోయింది. మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నప్పటికి ఆ మ్యాచ్‌ సమయంలో విరాట్‌ కోహ్లి తన భార్య అనుష్కపై చూపిన ప్రేమ మాత్రం ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ దుబాయ్‌లో జరుగుతున్న నేపథ్యంలో అనుష్క కూడా విరాట్‌తో పాటు అక్కడికి వెళ్లి బెంగుళూరు టీంను ఉత్సాహపరుస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ తన సహచరులతో మాట్లాడుతూ లాబీలో ఉన్న అనుష్క వైపు చూస్తూ తిన్నవా అంటూ  చేతితో సైగ చేస్తాడు.

దానికి అనుష్క అవును అన్నట్టు ఏదో చెబుతూ థమ్స్‌ అప్‌ సింబల్‌ చూపించారు. విరాట్‌ తన భార్య పట్ల చూపిస్తున్న ఆదరణ అభిమానుల ప్రశంసలు అందుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోను పరమిందర్‌సింగ్‌ అనే వ్యక్తి తన ట్విటటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. అనుష్క విరాట్‌ల జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ జనవరిలో వారింటికి మూడో వ్యక్తి రాబోతున్నాడంటూ సంతోషకరమైన వార్తను విరాట్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.  ఈ వీడియోను షేర్‌ చేస్తూ ‘ఈ వ్యక్తిని అందరూ ఇష్టపడటానికి చాలా విలువైన కారణాలు ఉన్నాయి. మీ ఇ‍ద్దరు చాలా క్యూట్‌గా ఉంటారు’ అంటూ పరమిందర్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: అయ్యో కోహ్లి.. బుమ్రా ‘సెంచరీ’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top