ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ బుడ్డోడు ఉతికారేశాడు. తొలిసారి హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొన్న వైభవ్.. 4 ఓవర్‌లో వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్‌లో వరసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఇది రెండో సారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. వైభవ్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తన సహచరుడు జైశ్వాల్ నుంచి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ నాలుగు మ్యాచ్‌లు 266.67 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2026: బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్? వీడియో వైరల్
Vaibhav Sooryavanshi in IPL
1st ball v Bumrah - 6
1st ball v Bhuvi - 4
1st ball v Shardul - 6
1st ball v Washington- 6
1st ball v Arshdeep - 4
1st ball v Hazlewood - 4
Unreal Talent, Unreal Hitting pic.twitter.com/XGQT8SnR4u— Cricketopia (@CricketopiaCom) April 10, 2026


