PC: BCCI/IPL
ఐపీఎల్-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో బిష్ణోయ్ బంతితో మ్యాజిక్ చేశాడు. బిష్ణోయ్ తన తొలి ఓవర్‌లోనే అద్బుతమైన బంతితో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు.
ఆర్సీబీ తమ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికి కోహ్లి మాత్రం బౌండరీలతో రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే డేంజర్‌గా మారుతున్న కోహ్లిని అవుట్ చేయడానికి కెప్టెన్ రియాన్ పరాగ్..ఐదో ఓవర్లోనే రవి బిష్ణోయ్‌ను రంగంలోకి దించాడు.
కెప్టెన్ నమ్మకాన్ని బిష్ణోయ్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్‌లో నాలుగో బంతికి కోహ్లికి బిష్ణోయ్ గుగ్లీగా సంధించాడు. బిష్ణోయ్ వేసిన ఆ అద్భుతమైన డెలివరీని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లి బంతిని బౌలర్ తల మీదుగా కొట్టడానికి ప్రయత్నించాడు.
అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో కోహ్లి ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లి కేవలం 16 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 32 పరుగులు చేశాడు. బిష్ణోయ్ విషయానికి వస్తే తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు లిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్'


