ఆరెంజ్‌ క్యాప్‌ వైభవ్‌దే.. ప్రైజ్‌మనీ ఎంతంటే? | Vaibhav Sooryavanshi Bags Orange Cap It In Style At Just 15 Years | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆరెంజ్‌ క్యాప్‌ వైభవ్‌దే.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

May 31 2026 11:13 PM | Updated on May 31 2026 11:43 PM

Vaibhav Sooryavanshi Bags Orange Cap It In Style At Just 15 Years

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ఐపీఎల్‌ ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్న వైభవ్‌.. యావత్తు క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. సూర్యవంశీ 16 మ్యాచ్‌లలో 776 పరుగులు చేసి ఈ ఆరెంజ్‌ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్‌ రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) పేరిట ఉండేది. ఐపీఎల్‌-2026 సీజన్‌లో గిల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. తాజా సీజన్‌తో గిల్‌ ఆల్‌టైమ్‌ రికార్డును వైభవ్‌ బ్రేక్‌ చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా నిలిచినందుకు వైభవ్‌కు రూ.10 లక్షలు నగదు బహుమతి దక్కింది.

ఛాంపియన్స్‌గా ఆర్సీబీ
ఇక ఐపీఎల్‌-2026 సీజన్‌ ఛాంపియన్స్‌గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో విరాట్‌ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో  75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 

అతడితో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా గుజరాత్‌ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది

Advertisement
 
Advertisement
Advertisement