Tokyo Paralympics: మనీష్‌ నర్వాల్‌, సింఘ్‌ రాజ్‌ అధనాకు భారీ నజరానా

Tokyo Paralympics 2021: Haryana Govt Announces Cash Rewards Govt Jobs For Manish Narwal Singhraj Adhana - Sakshi

టోక్యో: టోక్యో వేదికగా  జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో ప‌త‌కాలు గెలిచిన షూట‌ర్ల‌కు హ‌ర్యానా ప్ర‌భుత్వం శనివారం భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. 50 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌ విభాగంలో మనీష్‌ నర్వాల్‌ బంగారు పతకం సాధించగా, సింఘ్‌ రాజ్‌ అధనా రజత పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకున్న మనీష్ నర్వాల్‌కు రూ .6 కోట్లు, రజత పతకం సాధించిన  సింఘ్‌ రాజ్‌ అధనాకు రూ.4 కోట్లు రివార్డు ను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ప‌త‌కాలు గెలిచిన ఈ ఇద్ద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వ‌నున్న‌ట్లు హ‌ర్యానా స‌ర్కార్ ప్రకటించింది.

కాగా అ‍ంతకముందు పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్ ఆంటిల్‌కు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ .6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. డిస్కస్ త్రో ఎఫ్ -56 లో రజత పతకం సాధించినందుకు యోగేష్ కథునియాకు కూడా రూ. 4 కోట్ల రివార్డును ఆయన ప్రకటించారు. ఈ ఇద్దరు అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు  హ‌ర్యానా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

చదవండి: Tokyo Paralympics 2021: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top