Virat Kohli: అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం.. ఇంకా | T20 World Cup 2021 Ind Vs Pak: Virat Kohli Comments Match Against Pakistan | Sakshi
Sakshi News home page

T20 World Cup Ind Vs Pak: అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం: విరాట్‌ కోహ్లి

Oct 24 2021 8:30 AM | Updated on Oct 24 2021 5:26 PM

T20 World Cup 2021 Ind Vs Pak: Virat Kohli Comments Match Against Pakistan - Sakshi

ఎవరి బాధ్యతలు ఏమిటో అందరికీ బాగా తెలుసు. మా ప్రణాళికలను మైదానంలో అమలు చేయడమే మిగిలిందన్న కోహ్లి

T20 World Cup T20 Ind Vs Pak Virat Kohli Comments: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా టీమిండియా నేడు(ఆదివారం) పాకిస్తాన్‌తో తలపడబోతోంది. క్రికెట్‌ ప్రపంచం అమితాసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పోరు నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన మనసులోని మాటలు పంచుకున్నాడు. సమతుల్యత ఉన్న జట్టునే ఈ మ్యాచ్‌ కోసం ఎంపిక చేస్తామని స్పష్టం చేశాడు. కోహ్లి మాట్లాడుతూ... ‘‘ఐపీఎల్‌తో పోలిస్తే వరల్డ్‌ కప్‌లో పిచ్‌లు మెరుగ్గా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అయినా ఇది ఐసీసీ టోర్నీ కాబట్టి కచ్చితంగా పిచ్‌ల విషయంలో కనీస ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది కూడా. అయితే మంచు ప్రభావం మాత్రం కనిపిస్తుంది.

బ్యాలెన్స్‌డ్‌ టీమ్‌నే ఎంపిక చేస్తాం. ఎవరి బాధ్యతలు ఏమిటో అందరికీ బాగా తెలుసు. మా ప్రణాళికలను మైదానంలో అమలు చేయడమే మిగిలింది. భారత్, పాక్‌ మ్యాచ్‌ గురించి బయట అంతా ఏమనుకుంటున్నారనేది మాకు అనవసరం. మేం వాటిని పట్టించుకోం. బ్యాటింగ్, బౌలింగ్‌ గురించి మాత్రమే ఆలోచిస్తాం. హార్దిక్‌ కనీసం రెండు ఓవర్లు బౌలింగ్‌ చేయగలిగితే బాగుంటుంది కానీ ఆలోగా మాకు కావాల్సిన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే మెరుపు బ్యాటింగ్‌లో ఆటను మార్చగల హార్దిక్‌ను ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం’’ అని చిరకాల ప్రత్యర్థితో సమరానికి అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.

చదవండి: T20 WC Ind Vs Pak: అశ్విన్‌కు అవకాశం ఉందా.. మాలిక్‌ లేదా హఫీజ్‌.. టాస్‌ గెలిచిన జట్టు.. 
T20 World Cup: అప్పటి నుంచి టీమిండియా ఒక్క టైటిల్‌ కూడా గెలవలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement