T20 WC 2022: పంత్‌ ఆ స్థానానికి సరిపోడు! అతడిని ఆడించకపోవడమే మంచిది: భారత మాజీ ఓపెనర్‌

T20 WC 2022 Wasim Jaffer: Leaving Out Rishabh Will Best Thing For India - Sakshi

T20 World Cup 2022- Rishabh Pant: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ నేపథ్యంలో భారత జట్టులో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ స్థానం గురించి టీమిండియా మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను ఈ మెగా ఈవెంట్‌లో ఆడించకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అతడికి బదులు వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ను జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లు ఆడనుంది. దీంతో ఐసీసీ ఈవెంట్‌కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు దొరుకుతుంది. 

పంత్‌ ఆట అంత గొప్పగా ఏమీ లేదు!
ఇక మంగళవారం మొహాలీ వేదికగా ఆసీస్‌తో తొలి టీ20 ఆరంభం నేపథ్యంలో ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో చర్చలో వసీం జాఫర్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా.. ప్రపంచకప్‌లో భారత తుది జట్టు కూర్పుపై అభిప్రాయాలు పంచుకున్నాడు.


వసీం జాఫర్‌

‘‘రిషభ్‌ పంత్‌ను ఆడించాలా వద్దా అన్న విషయంపై యాజమాన్యం స్పష్టతకు రావాలి. నిజానికి టెస్టు, వన్డే మ్యాచ్‌లలో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత పంత​ సొంతం. కానీ అంతర్జాతీయ టీ20లలో పంత్‌ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ పంత్‌ కంటే దినేశ్‌ కార్తిక్‌ మెరుగ్గా రాణించాడు. నా అభిప్రాయం ప్రకారం.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగు లేదంటే ఐదో స్థానానికి రిషభ్‌ పంత్‌ సూట్‌కాడు. ఓపెనర్‌గా పంపితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

అందుకే అతడిని ఆడించకపోవడమే మంచిది!
అయితే, పంత్‌కు ఈ టోర్నీలో ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం జరగని పని. కాబట్టి పంత్‌ను ఈ వరల్డ్‌కప్‌లో ఆడించకపోవడమే ఉత్తమం. అతడి బదులు దినేశ్‌ కార్తిక్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు. 

అక్షర్‌ విషయంలో ఎందుకో ఇలా?
అదే విధంగా.. ‘‘మరో విషయం ఏమిటంటే.. అక్షర్‌ పటేల్‌ సైతం ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్‌ కూడా చేస్తున్నాడు. కానీ ఎందుకో యాజమాన్యం అతడికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

కాగా మెగా ఈవెంట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ జోడీగా రానుండగా.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా విరాట్‌ కోహ్లి ఉంటాడని.. భారత సారథి రోహిత్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చదవండి: T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్‌? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం
CSA 2022 Auction- Kavya Maran: ఆ వేలంలో హైలెట్‌గా కావ్య.. ఎంఐతో పోటీపడి! యువ హిట్టర్‌ కోసం భారీ ధర!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top