జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు | Sakshi
Sakshi News home page

T20 WC 2022: జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు

Published Thu, Nov 3 2022 6:52 PM

T20 WC 2022: If India Loses To Zimbabwe Semis Berth Will Be In Trouble - Sakshi

ఇవాళ సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌ గెలుపుతో గ్రూప్‌-2 సెమీస్‌ బెర్త్‌లు సంక్లిష్టంగా మారాయి. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, సౌతాఫ్రికాలు ఏ బాదరబందీ లేకుండా సెమీస్‌కు చేరతాయనుకుంటే పాక్‌ గెలుపుతో సమీకరణలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. చిన్న జట్టైన నెదార్లాండ్స్‌తో చివరి మ్యాచ్‌ ఆడాల్సి ఉండటంతో సౌతాఫ్రికా స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ..  టీమిండియానే ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌పై గెలిస్తే తొలి సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోనుండగా.. మరో బెర్తు కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. ఏమాత్రం అటుఇటు జరిగి భారత్‌.. జింబాబ్వే చేతిలో ఓడినా.. పాక్‌.. తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచినా.. మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా పాకిస్తానే సెమీస్‌కు వెళ్తుంది. కాబట్టి.. భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో జింబాబ్వేపై గెలిస్తేనే పాక్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.   

భారత్‌.. జింబాబ్వేపై గెలిచి, పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచి, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిందంటే భారత్‌, పాక్‌లు సెమీస్‌కు చేరకుంటాయి. అయితే ఇది అంతా ఆషామాషీ విషయం కాదు. 

గ్రూప్‌-2 నుంచి సెమీస్‌ రేసులో ఉన్న భారత్‌, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ జట్ల పాయింట్ల వివరాలు..

భారత్‌.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 6 పాయింట్లు (రన్‌రేట్‌=0.730)

సౌతాఫ్రికా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్‌ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు (రన్‌రేట్‌=1.402)

పాకిస్తాన్‌..4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు (రన్‌రేట్‌=1.085)

Advertisement
Advertisement