Sikandar Raza: మ్యాచ్‌లో చెలరేగడానికి పాంటింగ్‌ వీడియోనే స్పూర్తి: సికందర్‌ రజా

T20 WC 2022: How-Ricky Ponting Clip Inspired Sikandar Raza ZIM Vs PAK - Sakshi

సికిందర్‌ రజా.. ఇప్పుడు ఒక సంచలనం. పాకిస్తాన్‌ మూలాలున్న జింబాబ్వే క్రికెటర్‌. టి20 ప్రపంచకప్‌లో గురువారం పాకిస్తాన్‌ను ఒక్క పరుగు తేడాతో చిత్తు చేయడంలో రజా పాత్ర మరువలేనిది. మ్యాచ్‌ దాదాపు పాకిస్తాన్‌వైపు తిరిగింది అనుకున్న తరుణంలో సికందర్‌ రజా అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు తన మరుసటి ఓవర్లో మరో వికెట్‌ పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రజా ఔట్‌ చేసింది షాదాబ్‌ ఖాన్‌, హైదర్‌ అలీ, షాన్‌ మసూద్‌లు. ఈ ముగ్గురు మ్యాచ్‌ను ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగల సమర్థులు. వీరిని ఔట్‌ చేశాడు గనుకనే రజా అంత ఫేమస్‌ అయ్యాడు. 

ఇక సికందర్‌ రజా మ్యాచ్‌లో అంతగా రెచ్చిపోవడం వెనుక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ ఉన్నాడంటే నమ్ముతారా. అయితే అది కేవలం వీడియో రూపంలోనే. అవునండీ సికందర్‌ రజా ప్రదర్శనకు పాంటింగ్‌ వీడియోనే ప్రేరణ. మరి రజాకు అంతలా స్పూర్తినిచ్చేలా ఆ వీడియోలో ఏముంది అనేది ఆసక్తి కలిగించింది.

అయితే పాకిస్తాన్‌, జింబాబ్వే మ్యాచ్‌కు ముందు పాంటింగ్‌.. జింబాబ్వే ఆటగాళ్లనుద్దేశించి స్పూర్తినిచ్చే వ్యాఖ్యలు చేశాడు. ''నాకు తెలిసిన ఆటగాళ్లకు ఆల్‌ ది బెస్ట్‌.. తెలియని ఆటగాళ్లు బాగా రాణించాలని కోరకుంటున్నా. ఒత్తడిని తట్టుకొని మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. పాంటింగ్‌ వ్యాఖ్యలను తాను స్పూర్తిగా తీసుకున్నట్లు సికిందర్‌ రజా మ్యాచ్‌ అనంతరం తెలిపాడు.

''నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. మ్యాచ్‌కు ముందు రికీ పాంటింగ్‌ వీడియో క్లిప్‌ చూశా. ఆయన వ్యాఖ్యలు నాకు బాగా నచ్చాయి. ఎందుకో ఆయన వ్యాఖ్యలు ఆదర్శంగా తీసుకొని రాణించాలనుకున్నా. అన్నీ కలిసొచ్చి.. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించా. అందుకు పాంటింగ్‌కు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఇక మ్యాచ్‌ విజయం అనంతరం కొంత మంది మిత్రులు, బంధువులు మెసేజ్‌ చేయడం నా కంట్లో నీరు తెప్పించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

పాకిస్తాన్‌పై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే తమ తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 30న(ఆదివారం) బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అదే రోజు టీమిండియా.. సౌతాఫ్రికాతో, పాకిస్తాన్‌ నెదర్లాండ్స్‌తో అమితుమీ తేల్చుకోనున్నాయి.

చదవండి: సౌతాఫ్రికాలో పుట్టి నెదర్లాండ్స్‌ తరపున ఆడి; తాజాగా కివీస్‌కు

టి20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న వరుణుడు.. 

పాక్‌ మూలాలున్న క్రికెటర్‌ ముచ్చెమటలు పట్టించాడు

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top