సత్తా చాటిన స్టబ్స్‌ | T20 Blast 2026, Tristan Stubbs Fires On Debut As Hampshire Hawks Down Essex Eagles, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన స్టబ్స్‌

May 27 2026 5:41 PM | Updated on May 27 2026 6:09 PM

T20 Blast 2026: Stubbs fires on debut as Hampshire Hawks down Essex Eagles

ఐపీఎల్‌ 2026లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌).. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగాడు. హ్యాంప్‌షైర్‌ తరఫున అరంగేట్రంలోనే ఇరగదీశాడు. ఫలితంగా ఆ జట్టు ఎసెక్స్‌పై 30 పరుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హ్యాంప్‌షైర్‌.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (42 బంతుల్లో 69 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హిల్టన్‌ కార్ట్‌రైట్‌ (21 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జో వెథర్లీ (34 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

హ్యాంప్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో టాబీ అల్బర్ట్‌ (13), కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ (8), టామ్‌ ప్రెస్ట్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎసెక్స్‌ బౌలర్లలో ఛార్లీ బెన్నెట్‌ 2, మాథ్యూ క్రిచ్లీ, కెప్టెన్‌ సైమన్‌ హార్మర్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 201 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఎసెక్స్‌.. స్కాట్‌ కర్రీ (4-0-18-4) ధాటికి  170 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితమై, ఓటమిపాలైంది. కర్రీతో పాటు క్రిస్‌ వుడ్‌ (4-0-33-2), ఆండ్రూ జాన్‌ నీల్‌ (4-0-36-1) కూడా వికెట్లు తీశారు. 

ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో లూక్‌ బెన్‌కెన్స్టైన్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో హార్మర్‌ (36 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. మిగతా ప్లేయర్లలో మైఖేల్‌ పెప్పర్‌ (25), వియాన్‌ ముల్దర్‌ (14), నోవా థైన్‌ (18) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2026లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ 14 మ్యాచ్‌ల్లో రెండు అర్ద సెంచరీలు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. నిన్న జరిగిన క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ గుజరాత్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కు చేరింది. ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌-రాజస్థాన్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement