యువ రెజ్లర్‌ హత్య కేసులో సుశీల్ కుమార్‌కు బెయిల్ నిరాకరణ

Sushil Kumar Bail Petition Opposed In Sagar Dhankar Rana Murder Case - Sakshi

Wrestler Sushil Kumar Bail Plea Opposed: సాగర్‌ ధనకర్‌ రాణా అనే యువ రెజ్లర్‌ హత్య కేసులో నిందితుడు, ఒలింపిక్స్‌ పతక విజేత సుశీల్ కుమార్ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి శివాజీ ఆనంద్‌.. సుశీల్‌ కుమార్‌కు  బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. సాగర్‌ను అడవి పందిని వేటాడినట్లు వేటాడి క్రూరంగా హింసించి చంపారని బాధితుడి తరఫు న్యాయవాది, స్పెషల్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ కుమార్ శ్రీ వాస్తవ కోర్టుకు తెలిపారు. 

మరోవైపు సుశీల్ కుమార్ తరపు లాయర్ తన క్లయింట్‌ను కావాలనే కేసులో ఇరికించారని, మృతుడి మరణ వాంగ్మూలాన్ని 40 రోజులు ఆలస్యంగా కోర్టుకు సమర్పించారని వాదించారు. ఈ కేసులో మొత్తం 13 మందిపై ఐపీసీ 302, 307, 147 సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా, మే 4న ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వ‌ద్ద 23 ఏళ్ల సాగ‌ర్ ధనకర్‌ రాణాను హ‌త్య చేసిన కేసులో సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్‌.. 2008, 2012 విశ్వక్రీడల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాడు.
చదవండి: క్రికెట్‌ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్‌ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top