సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో? | Suryakumar Yadav skips clash against Uganda amid threat to T20I captaincy | Sakshi
Sakshi News home page

సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో?

May 30 2026 6:42 PM | Updated on May 30 2026 6:42 PM

Suryakumar Yadav skips clash against Uganda amid threat to T20I captaincy

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌స్తుతం త‌న కెరీర్‌లోనే అత్యంత‌ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. సార‌థిగా భార‌త్‌కు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించిన సూర్య‌కుమార్‌.. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఐపీఎల్‌-2026లోనూ సూర్య అదే తీరును క‌న‌బ‌రిచాడు. ఈ ముంబై ఆట‌గాడు 13 మ్యాచ్‌ల‌లో 20.77 స‌గ‌టుతో కేవ‌లం 270 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

దీంతో భార‌త జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పించేందుకు బీసీసీఐ సిద్ద‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా టీ20 జ‌ట్టు నుంచే అత‌డిని ప‌క్క‌న పెట్టాల‌నే యోచ‌న‌లో సెలెక్ట‌ర్లు ఉన్న‌ట్లు స‌మాచారం.

అయితే సూర్య‌కు త‌న ఫామ్‌ను తిరిగి అందుకోవ‌డానికి ముంబై టీ20 లీగ్ రూపంలో మ‌రో అవ‌కాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టీ20 టోర్నీలో ట్రయంఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్‌కు సార‌థ్యం వ‌హించ‌నున్నాడు.

అయితే అంత‌కంటే ముందు శ‌నివారం(మే 30)న ఉగాండాతో జ‌రగ‌నున్న మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్ జ‌ట్టు త‌ర‌పున సూర్య‌కుమార్ బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ సూర్య మాత్రం ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. స్కై  గైర్హాజరీలో అఖిల్ హెర్వాడ్కర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

కాగా  ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను ఉగాండా సొంతం చేసుకుంది. అనంత‌రం ముంబై టీ20 లీగ్‌లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్ర‌మంలోనే డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా ఉగాండా, ట్రయంఫ్ నైట్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.
చదవండి: IPL 2027: రోహిత్ శ‌ర్మ వ‌ద్దు.. ముంబై కెప్టెన్‌గా అత‌డే స‌రైనోడు

Advertisement
 
Advertisement
Advertisement