Steve Smith spotted shadow batting late Night in Adelaide hotel room- Sakshi
Sakshi News home page

Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్‌

Dec 19 2021 12:02 PM | Updated on Dec 19 2021 3:08 PM

Steve Smith spotted shadow batting late Night in Adelaide hotel room - Sakshi

అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 473/9 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను 236 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగుల ఆధిక్యం ఆసీస్‌కు లభించింది. ఇక ఆసీస్‌ 473 పరుగుల భారీస్కోర్‌ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(93)కీలక పాత్ర పోషించాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 45 పరుగులు చేసి, 290 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్ధితి నిలవడంతో మిగితా ఆటగాళ్లు అందరూ ప్రశాంతంగా నిద్రపోయినా, స్టాండింగ్‌ కెప్టెన్‌ స్మిత్‌  మాత్రం నిద్ర పోలేదు. అర్ధరాత్రి స్మిత్‌ నిద్రపోకుండా షాడో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి భార్య డాని విల్లిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోకు "స్టీవ్‌ స్మిత్‌  తన కొత్త బ్యాట్‌ని చూస్తున్నారు" అని ఆమె క్యాప్షన్‌ పెట్టింది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "అర్ధ రాత్రి పడుకోకుండా అది ఏం పని" అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. కాగా రెగ్యూలర్‌ కెప్టెన్‌ పాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్‌ ఈ టెస్ట్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టాడు.

చదవండి: Kohli-Ganguly: 'కోహ్లి యాటిట్యూడ్‌ అంటే చాలా ఇష్టం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement