సౌతాఫ్రికా విజయం.. రసపట్టులో టీ20 సిరీస్‌! | South Africa Won By 19 Runs Vs New Zeland 4th T20 Equals Series | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా విజయం.. రసపట్టులో టీ20 సిరీస్‌!

Mar 22 2026 3:39 PM | Updated on Mar 22 2026 4:42 PM

South Africa Won By 19 Runs Vs New Zeland 4th T20 Equals Series

న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగ2ఆ జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా 2-2తో రెండు జట్లు సమంగా నిలిచాయి.  

తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కొన్నర్ ఎస్తర్‌హూజిన్ (36 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవవగా, రుబిన్ హెర్మన్ (28 నాటౌట్‌), టోనీ డి జోర్జి (23) రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బ​రిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. 

టిమ్ రాబిన్‌సన్ (22 బంతుల్లో 32) టాప్ స్కోరర్‌గా నిలవగా, డేన్ క్లెవర్ (26) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా, బార్త్‌మన్‌, సుబ్రెయన్, కేశవ్ మహరాజ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.  అర్థసెంచరీతో  మెరిసిన ఎస్తర్‌హుజిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ గెలుచుకున్నాడు.  

మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. వియాన్ ముల్డర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టోనీ డిజార్జి, ఎస్తర్ హుజిన్‌లు రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించి సఫారీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. టోనీ ఔటైన తర్వాత క​ఈజులోకి వచ్చిన రుబిన్ హెర్మన్ ధాటిగా ఆడాడు. 

ఎస్తర్‌హుజిన్ పెవిలియన్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ చివర్లో జాసన్ స్మిత్‌, డియాన్ ఫెరస్టర్‌లు బ్యాట్ ఝలిపించడంతో సౌతాఫ్రికా గౌరప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఆది నుంచే తడబడిన న్యూజిలాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement