సిరాజ్ మియా సూప‌ర్ యార్క‌ర్‌.. బ్యాట‌ర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో | Siraj Shatters Shahrukh Khans Stumps With Swinging Yorker | Sakshi
Sakshi News home page

IPL 2024: సిరాజ్ మియా సూప‌ర్ యార్క‌ర్‌.. బ్యాట‌ర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Apr 28 2024 6:17 PM | Updated on Apr 28 2024 6:17 PM

Siraj Shatters Shahrukh Khans Stumps With Swinging Yorker

ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ సంచ‌ల‌న బంతితో మెరిశాడు. గుజ‌రాత్ బ్యాట‌ర్ షారుఖ్ ఖాన్‌ని అద్భుత‌మైన ఇన్ స్వింగ‌ర్ యార్క‌ర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు.  స్పిన్న‌ర్ల‌ను షారుఖ్ టార్గెట్ చేస్తుండ‌డంతో బెంగ‌ళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌.. సిరాజ్‌ను బౌలింగ్ ఎటాక్‌లో తీసుకువ‌చ్చాడు.

 ఫాప్ న‌మ్మ‌కాన్ని సిరాజ్ వ‌మ్ము చేయ‌లేదు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ 15 ఓవ‌ర్ వేసిన సిరాజ్‌.. తొలి బంతినే ఇన్ స్వింగ‌ర్ యార్క‌ర్‌గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి  షారుఖ్ ఖాన్ ద‌గ్గ‌ర స‌మాధాన‌మే లేకుండా పోయింది. అత‌డు బంతిని బ్యాట్‌తో ఆపే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్త‌ర‌పోయాడు. ఈ క్ర‌మంలో సిరాజ్ త‌న ట్రేడ్‌మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో చెలరేగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement