సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మర్ 36 ఏళ్ల వయస్సులో సత్తచాటుతున్నాడు. రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జగిన రెండో టెస్టులో హర్మర్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన హర్మర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంతితో అద్భుతం చేశాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి పాక్ ఓటమిని శాసించాడు.
మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1000 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో దక్షిణాఫ్రికా బౌలర్‌గా హర్మెర్ నిలిచాడు.
ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 234 మ్యాచ్‌లు ఆడిన హర్మెర్.. 1000 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా దిగ్గజం చార్లీ లెవెలిన్(1013) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్ధానాల్లో మైక్ ప్రాక్టర్(1417), అలెన్ డొనాల్డ్(1216) ఉన్నారు.
కాగా ఫస్ల్ క్రికెట్‌లో సంచలన ట్రాక్ రికార్డు ఉన్న హర్మెర్.. జాతీయ జట్టుకు మాత్రం అతి తక్కువ మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. హర్మెర్ సెలక్టర్లు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో ప్రోటీస్ టెస్టు జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అతడి పేరిట 52 టెస్టు వికెట్లు ఉన్నాయి.
వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న సౌతాఫ్రికా జట్టులో భాగం కానున్నాడు. భారత్ పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించే అవకాశమున్నందన అతడు ప్రోటీస్ జట్టుకు కీలకం కానున్నాడు.
చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?


