క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్‌మన్‌ గిల్‌ | Shubman Gill, Riyan Parag Left Confused After Bizarre Incident During Toss At IPL Qualifier 2 | Sakshi
Sakshi News home page

IPL 2026: క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్‌మన్‌ గిల్‌

May 29 2026 8:14 PM | Updated on May 29 2026 8:31 PM

Shubman Gill, Riyan Parag Left Confused After Bizarre Incident During Toss At IPL Qualifier 2

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్‌-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన  చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్‌లో శుభ్‌మ‌న్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు.

రియాన్ ప‌రాగ్ 'హెడ్స్' అని కాల్‌ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్‌ను రద్దు చేసి,  రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్‌ను విసరగా..  రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు.

ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్‌ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్‌కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement