
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్‌పై వేటు పడనుందా? అంటే అవును అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఒక్క ఛాన్స్ అంటూ ఏడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. తన పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నాయర్ మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు వేసేందుకు అజిత్ అగర్కారర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిద్దమైనట్లు తెలుస్తోంది.
శ్రేయస్ రీ ఎంట్రీ..
అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆక్టోబర్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌తో అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయ్యర్ చివరగా టెస్టుల్లో భారత తరపున 2024లో ఇంగ్లండ్‌పై ఆడాడు.
ఆ తర్వాత జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కూడా తన స్ధానాన్ని అయ్యర్ కోల్పోయాడు. అయితే దేశవాళీ టోర్నీలో అద్బుతంగా రాణించి తిరిగి జాతీయ జట్టులోకి ఈ ముంబైకర్ వచ్చాడు. కానీ కేవలం వన్డే జట్టులో మాత్రమే అతడికి చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో అయ్యర్‌ది కీలక పాత్ర.
ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అయ్యర్ బదులుగా కరుణ్ నాయర్‌కు అవకాశమిచ్చారు. కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో సెలక్టర్లు మళ్లీ అయ్యర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయ్యర్ లాంటి ప్లేయర్ కావాలి..
భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో అయ్యర్ లాంటి అనుభవజ్ఞుడైన మిడిలార్డర్ బ్యాటర్ అవసరం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మాకు లోటు స్పష్టంగా కన్పించింది. స్పిన్నర్లను శ్రేయస్ అయ్యర్ అద్బుతంగా ఆడగలడుజ స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో స్పిన్ బాగా ఆడిగలిగే ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు.
దీంతో అయ్యర్‌ను కచ్చితంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారని" ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు ఐదు ఆర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. కీలక టోర్నీకి దూరం?