ఇంగ్లండ్‌కు చుక్క‌లు చూపించిన తెలుగు అమ్మాయి | Shree Charani grabs three but Kemps late blitz lifts England to 168-5 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు చుక్క‌లు చూపించిన తెలుగు అమ్మాయి

May 30 2026 8:57 PM | Updated on May 30 2026 9:04 PM

Shree Charani grabs three but Kemps late blitz lifts England to 168-5

బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు రాణించారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి, యువ స్పిన్నర్ శ్రీచరణి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. డాని వ్యాట్‌, అమీ జోన్స్‌, నైట్‌ వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. 

ఈ కడప అమ్మాయి తన 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు నందిని శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీశారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓ దశలో ఇంగ్లండ్ 150 పరుగుల మార్క్ కూడా దాటేలా కనిపించలేదు. 

కానీ చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు 39 పరుగులు సమర్పించుకోవడంతో ఇంగ్లండ్ ఫైటింగ్ టోటల్‌ను సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫ్రేయా కెంప్(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డానీ వ్యాట్‌(29), క్యాప్సీ(28) పర్వాలేదన్పించారు. ఇప్పటికే తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిందిన. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంటుంది.
చదవండి: IPL 2026: ఫైనల్‌కు వాన గండం..! మ్యాచ్‌ రద్దైతే విజేత ఎవరంటే?

Advertisement
 
Advertisement
Advertisement